Aashraya Durgamaa Naa Yesayyaa Song Lyrics
Lyrics in Telugu
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే (ఆశ్రయ)
1. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే “2”
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి “2” (ఆశ్రయ)
2 నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే “2”
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి “2” (ఆశ్రయ)
3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద “2”
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి “2” (ఆశ్రయ)
4. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది “2”
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా “2” (ఆశ్రయ)
Lyrics in English
Aashraya Durgamaa – Naa Yesayyaa
Nava Jeevana Maargamunaa – Nannu Nadipinchumaa
Oohinchalene Nee Krupaleni Kshanamunu
Kopinchuchune Vaathsalyamu Naapai Choopinaave (Aashraya)
1. Loka Maryaadalu Mamakaaraalu Gathinchi Povune
Aathmeeyulatho Akshaya Anubandham Anugrahinchithive “2”
Anduke Ee Sthuthi Ghana Mahimala Sthothraanjali “2” (Aashraya)
2. Naatho Neevu Chesina Nibandhanalanniyu Nerverchuchuntive
Neetho Chesina Theermaanamulu Sthiraparachithive “2”
Anduke Ee Sthuthi Ghana Mahimala Sthothraanjali “2” (Aashraya)
3. Paravaasinaithini Vaagdhaanamulaku Vaarasathvamunnanu
Nee Shikshanalo Anukuvathone Nee Krupa Pondeda “2”
Anduke Ee Sthuthi Ghana Mahimala Sthothraanjali “2” (Aashraya)
4. Nithya Nivaasinai Nee Mukhamu Choochuchu Paravashinchedane
Ee Nireekshanaye Utthejamu Naalo Kaliginchuchunnadi “2”
Sthuthi Ghana Mahimalu Neeke Chellunu Naa Yesayyaa
Hallelooyaa Hallelooyaa Hallelooyaa “2” (Aashraya)