Adharinchaga Rava Song Lyrics
ఆగని పరుగులో ఎండిన ఎడారులు
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపునా
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై
కరుణించే నీ చూపు, మన్నించే నా మనవి
అందించే నీ చేయి, నా స్నేహమై
1. లోకప్రేమే సదా – కలల కడలే కదా
తరంగమై కావుమా – తిరిగి తీరమునకు “2”
నీవే కదా ఆధారం
సదా నీకే దాసోహం
యేసయా … అర్పించెదా – నా జీవితం
2. ఎదుట నిలిచే నీవే – ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా – జార విడువకు నన్ను “2”
నీవే కదా నా మూలం
సదా నీపై నా భారం
యేసయా … ప్రేమించెదా – కలకాలము
Music : Pranam Kamlakhar
Lyrics & Producer : Joshua Shaik
Singer : Anwesshaa
Keys Programming : Chinna
Flute : Pranam Kamlakhar
Guitars : Keba Jeremiah
Solo Violin : Chandu
Harmony : Valli Gayatri , Aishwarya , Sudarshini , Shivani
Music Co-Ordinators : Vincent & Narender
Mixed & Mastered : AP Sekhar
Video Edit : Priyadarshan
Title Design : Charan