Bhajana Cheyuchu Bhakthapaalaka Song Lyrics
Lyrics in Telugu
భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును “2”
వృజినములపై జయము నిచ్చిన “2”
విజయుడా నిను వేడుకొందు (భజన)
1. దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు “2”
భవ్యమైన బోధలెన్నో “2”
బాగుగా ధర నేర్పినావు (భజన)
2. నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు “2”
పరుడ నైన నా కొరకు నీ “2”
ప్రాణము నర్పించినావు (భజన)
3. చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు “2”
పడిన నాడు గోతి నుండి “2”
పైకి లేవనెత్తి నావు (భజన)
4. ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు “2”
ఇంతయని వర్ణింప నిలలో “2”
నెవనికిని సాధ్యంబు కాదు (భజన)
Lyrics in English
Bhajana Cheyuchu Bhakthapaalaka
Prasthuthinthu Nee Naamamunu (2)
Vrujinamulapai Jayamu Nichchina (2)
Vijayudaa Ninu Veedukondu (Bhajana)
Divya Padavini Vidichi Neevu
Deenudavai Puttinaavu (2)
Bhavyamaina Bodhalenno (2)
Baagugaa Dhara Nerpinaavu (Bhajana)
Narula Gaavanu Paramunundi
Dharaku Neevu Vachchinaavu (2)
Paruda Naina Naa Koraku Nee (2)
Praanamu Narpinchinaavu (Bhajana)
Chedinavaada Naina Nannu
Jeradeesi Prochinaavu (2)
Padina Naadu Gothi Nundi (2)
Paiki Levaneththi Naavu (Bhajana)
Entha Prema Yentha Daya
Yentha Krupa Yesayya Neeku (2)
Inthayani Varnimpa Nilalo (2)
Nevanikini Saadhyambu Kaadu (Bhajana)