Chirakala sneham neeprema charitham Song Lyrics
చిరకాల స్నేహం – నీప్రేమ చరితం – చిగురించే నాకొసమే “2”
నీపై నా ధ్యానం – నాకై నీ త్యాగం – వింతైన సందేశమే
చిరకాల స్నేహం – నీప్రేమ చరితం – చిగురించే నాకొసమే “2”
1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై “2”
నేను నీకు భారమైన దూరమైన వేళలో
నీవే నాకు చేరువై చేరదీసినావయా
ఎంత ప్రేమ యేసయ్యా (చిరకాలం)
2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది “2”
సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో
దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా
తోడు నీవే యేసయ్యా (చిరకాలం)
3. మధురమైన ప్రేమలోన విలువకలిగె సిలువకు “2”
శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను
శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా
నిలిపినావు యేసయ్యా (చిరకాలం)