Chudachakkani Nee Rupam Song Lyrics
చూడచక్కని నీ రూపమే ఘోరమాయెనా
చూడలేక సూర్యుడే చీకటాయెనా
సుందరమగు నీ వదనమే మారిపోయెనా
వేదనతో నీ చెమటె రక్తమాయేనా (2)
నా కోసమేగా ఈ కలువరి శిక్ష
నా కోసమేగా ఈ ఘోర పరీక్ష
నా కోసమేగదయ్యా నా యేసయ్య
నా కోసమేగదయ్య (2)
1. నీవు పంచిన రొట్టెలే రాళ్ళాయెనా
ఆ చేతులకే మేకులు బిగియించెనా
నీ స్వస్థత కార్యములతో మేలు పొందిన
ఆ నోళ్ళె సిలువ వేయమని అరిచెనా(2)
జాలైన చూపలేదు _ కనికరపడలేదు(2)
శిక్షించమని అరచితిరా ఆ జనులు
2. సంకెళ్ళతో నిన్ను బందించినా
వధకు తేబడు పశువుగా నిన్ను మార్చిన
పిడిగుద్దులతో నిన్ను గాయపరచిన
అవమానపరిచి నిన్ను బాధపెట్టినా (2)
మాటైన పలుకలేదు – నోరైన మెదుపలేదు (2)
మౌనము వహియించితివా నా కొరకు