- Advertisement -
Christian LyricsDeva Samsthuthi Cheyave Song Lyrics

Deva Samsthuthi Cheyave Song Lyrics

Deva Samsthuthi Cheyave Song Lyrics

Lyrics in Telugu

దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా (దేవ సంస్తుతి)

1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు “2”
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను “2”
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

3. యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త “2”
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

4. ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ “2”
విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

5. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు “2”
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

6. పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు “2”
భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

7. పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత “2”
ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

8. కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల “2”
యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

9. మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి “2”
మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

10. పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన “2”
వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు “2”
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే (దేవ సంస్తుతి)

Lyrics in English

Deva Samsthuthi Cheyave Manasaa
Sree-manthudagu Yehova Samsthuthi Cheyave Manasaa
Deva Samsthuthi Cheyumaa Naa – Jeevama Yehovaa Devuni
Paavana Namaamu Nuthinchumaa – Naa Yantharangamu
lo Vasinchu No Samasthamaa (Deva Samsthuthi)

1. Jeevamaa, Yehovaa Neeku – Jesina Mellan Maruvaku “2”
Neevu Chesina Paathakambulanu – Manninchi Jabbu
Leviyun Lekunda Jeyunu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

2. Chaavu Gothinundi Ninnu – Levanetthi Dayanu Grupanu “2”
Jeeva Kireetamuga Veyunu – Nee Shirasu Meeda
Jeeva Kireetamuga Veyunu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

3. Yavanambu Pakshiraaju – Yavanambu Valene Krottha “2”
Yavanambai Velayunatlugaa – Me Lichchi Needu
Bhaavamunu Santhushtiparachunugaa – Aa Kaaranamuche (Deva Samsthuthi)

4. Prabhuvu Neethi Panulu Cheyun – Baadhithulaku Nyaaya Michchun “2”
Vibhundu Maargamu Thelipe Mosheku – Dana Kaaryamulanu
Vippe Nishraayelu Janamunaku – Aa Kaaranamuche (Deva Samsthuthi)

5. Athyadhika Prema Swaroopi-Yaina Deergha Shaanthaparundu “2”
Nithyamu Vyaajyambu Cheyadu – Aa Kruponnathudu
Nee Payi Nepudu Kopa Munchadu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

6. Paamarula Mani Prathyupakaara – Prathi Phalambul Pampaledu “2”
Bhoomi Kanna Naakasambunna – Yetthundu Daiva
Prema Bhakthi Janulayanduna – Aa Kaaranamuche (Deva Samsthuthi)

7. Padamatiki Thoorpentha Yedamo – Paapamulakunu Manaku Nanatha “2”
Yedamu Kalugajesiyunnaadu – Mana Paapamulanu
Edamugaane Chesiyunnaadu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

8. Kodukulapai Thandri Jaali – Padu Vidhamugaa Bhakthiparula “2”
Yedala Jaali Padunu Devundu – Thana Bhakthiparula
Yedala Jaalipadunu Devundu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

9. Manamu Nirmithamayina Reethi – Thanaku Delisiyunna Sangathi “2”
Manamu Manti Vaaramanchunu – Gnaapakamu Chesi
Konuchu Karuna Joopuchundunu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

10. Poosi Gaali Veeva Negiri – Poyi Basanu Deliyani Vana “2”
Vaasa Pushpamu Valene Narudundu – Naru Naayuvu Thruna
Praayamu Mana Deva Krupa Mendu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

11. Parama Deva Nibandha Naagnal – Bhakthitho Gaikonu Janulaku “2”
Nirathamunu Grupa Nilichi Yundunu – Yehova Neethi
Tharamulu Pillalaku Nundunu – Aa Kaaranamuche (Deva Samsthuthi)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Subscribe Today

Christian Lyrics

Bible Messages

Verses by Topics

Apps and More

Get unlimited access to our EXCLUSIVE Content and our archive of subscriber stories.

Exclusive content

- Advertisement -

Latest article

More article

- Advertisement -
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

error: Google not allow this!
%d bloggers like this: