Emundi Naalo Song Lyrics
ఏముంది నాలో – నీ పరిశుద్ధత లేదే
అయినా నను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినా నను ప్రేమించితివే
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు నన్ను మురిపించావు
1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది (ఏముంది)
2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు
గుచ్చిరి శిరమునే ముండ్ల మకుాన్ని నా కోసం ధరియించావు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది (ఏముంది)
Nice song I love it