Goppa devuda mahonnathuda Song Lyrics
గొప్ప దేవుడా మహోన్నతుడా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆనందింతును సేవింతును
ఆత్మతొ సత్యముతో ఆరాధింతును
1. నా దీనదశలో నన్నాధుకొని
నీ ఆశ్రయ పురములో చేర్చుకొని
నీ సన్నిధిలో నివశింప జేసీతివి
నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి (గొప్ప దేవుడా)
2.వివేకముతో జీవించుటకు
విజయముతొ నిను స్తుతించుటకు
నీ రక్షణతో అలంకరించితివి
నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి ( గొప్ప దేవుడా)
3.సర్వసత్యములో నేనడచుకొని
నిత్య సియోనులో నేనిలుచుటకు
జీవపు వెలుగు లో నడిపించుచున్నావు
నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు. (గొప్ప దేవుడా)