Hosannanuchu Sthuthi Paaduchu Song Lyrics
Lyrics in Telugu
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం “2”
హోసన్నా… హోసన్నా… “4” (హోసన్ననుచూ)
1. ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం “2”
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం “2” (హోసన్నా)
2. మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము “2”
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము “2” (హోసన్నా)
3. ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును “2”
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం “2” (హోసన్నా)
Lyrics in English
Hosannanuchu Sthuthi Paaduchu Seeyonuku Cheredam “2”
Hosannaa.. Hosannaa.. “2” (Hosannanuchu)
Ee Lokayaathralo Baatasaarulam
Ee Jeevana Kadalilo Paradeshulam “2”
Kshana Bhanguram Ee Kshaya Jeevitham
Akshaya Nagaram Manaku Shaashwatham “2” (Hosannaa)
2. Mannayina Ee Deham Mahima Roopamai
Davala Varna Vasthramulu Dhariyinchedamu “2”
Naadhudesuku Nava Vadhuvulamu
Neethi Paalanalona Yuva Raanulamu “2” (Hosannaa)
3. Prathi Baashpa Binduvunu Thudichiveyunu
Chinthalanni Theerchi Chentha Niluchunu “2”
Aakali Ledu Dappika Ledu
Aahaa Mana Yesutho Nithyamaanandam “2” (Hosannaa)