Jeevithamante Maatalu Kaadu Song Lyrics
Lyrics in Telugu
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
(ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – “2” (జీవితమంటే)
1. నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు
నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు “2”
ఈ అన్నల నమ్మే కంటే…
ఈ అన్నల నమ్మే కంటే
అన్న యేసుని నమ్ముకో
రాజ్యం నీదే మేలుకో
పరలోకం నీదే ఏలుకో (జీవితమంటే)
2. నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా “2”
ఈ మనుషులలోనే…
ఈ మనుషులలోనే – మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు
సమయం మనకు లేదమ్మా
ఇక త్వరపడి యేసుని చేరమ్మా (జీవితమంటే)
3. నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు
నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే “2”
యేసుని రాకకు ముందే…
యేసుని రాకకు ముందే
మారు మనస్సును పొందుమా
ప్రభుని చెంతకు చేరుమా
రక్షణ భాగ్యం పొందుమా (జీవితమంటే)
Lyrics in English
Jeevithamante Maatalu Kaadu Chellemmaa
(Ivi) Manishi Manishini Namme Rojulu Kaavammaa – “2” (Jeevithamante)
1. Nammukunnaadu Yosepu – Ammukunnaaru Annalu
Nammukunnaadu Eshaavu – Mosaginchaadu Yaakobu “2”
Ee Annala Namme Kante…
Ee Annala Namme Kante
Anna Yesuni Nammuko
Raajyam Neede Meluko
Paralokam Neede Eluko (Jeevithamante)
2. Nammukunnaadu Yesayyaa – Ammukunnaadu Shishyudu
Paapula Korakai Vachchaadammaa – Praanaale Theesaarammaa “2”
Ee Manushulalone…
Ee Manushulalone – Mamathalu Levu
Manchithanaaniki Rojulu Kaavu
Samayam Manaku Ledammaa
Ika Thvarapadi Yesuni Cherammaa (Jeevithamante)
3. Nammakamaina Vaadu – Unnaadu Mana Devudu
Nammadaginavaadu – Vasthaadu Thvaralone “2”
Yesuni Raakaku Munde…
Yesuni Raakaku Munde
Maaru Manassunu Pondumaa
Prabhuni Chenthaku Cherumaa
Rakshana Bhaagyam Pondumaa (Jeevithamante)