Krupagala Deva dayagala raja Song Lyrics
Lyrics in Telugu
కృపగల దేవా దయగల రాజా – చేరితి నిన్నే బహుఘనతేజ
నీ చరణములే నే కోరితిని – నీ వరములనే నే వేడితిని
సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా
1: త్రోవను చూపే తారవు నీవే – గమ్యము చేర్చే సారధి నీవే
జీవనయాత్ర శుభప్రదమాయే – నా ప్రతి ప్రార్థన పరిమళమాయే
నీ ఉదయకాంతిలో నను నడుపుము – నా హృదిని నీ శాంతితో నింపుము (కృపగల)
2: కృప చూపి నన్ను అభిషేకించి – వాగ్దానములు నెరవేర్చినావే
బహు వింతగా నను ప్రేమించినావే – బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును – నీ దివ్యమహిమలను ప్రకటింతును (కృపగల)
3: నా యేసురాజ వరుడైన దేవా – మేఘాల మీద దిగివచ్చువేళ
ఆకాశవీధిలో కమనీయ కాంతిలో – ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో – జీవింతు నీలోనే యుగయుగములు (కృపగల)
Lyrics in English
Krupagala Deva dayagala raja – cherithi ninne bahuganateja
nee cheranamule ney korithini – nee varamulane ney vedithini
sarvadhikaari neeve deva – naa sahakaari neeve prabhuva
naa korikale saphalamu chesi – alochanale neraverchithivi
arpinchedanu naa sarvamunu neeke deva
aaradhinchi aanandhincheda neelo devaa
1. throvanu chupi thaaravu neeve – gamyamu cherche saaradhi neeve
jeevanayathra shubhapradhamaaye – naa prathi pradhana parimalamaaye
nee udayakaanthilo nannu nadupumu – naa hrudhini nee shanthitho nimpumu (krupagala)
2. krupachupi nannu abhishekinchi – vagdhanamulu neraverchinaave
bahu vinthagaa nannu preminchinaave – balamaina janamugaa nannu maarchinaave
nee keerthi jagamantha vivarinthunu – nee divyamahimanu prakatinthunu (krupagala)
3. naa yesu raja varudaina deva – meghala meeda dhigi vachu vela
aakashaveedilo kamaniya kanthilo – priyamaina sanghamai ninu cheredhanu
nilichedanu neethone siyonulo – jeevinthu neelone yugayugamulu (krupagala)