Maha Mahimatho Nindina Song Lyrics
మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా
1. మహిమను విడచి భూవిపైకి దిగివచ్చి – కరుణతో నను పిలచి
సత్యమును భోదించి చీకటిని తొలగించి – వెలుగుతో నింపితివి
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు
2. కరములు చాపి జలారాశులలో నుండి – నను లేవనెత్తితివి
క్షేమమును దయ చేసి నను వెంబడించి అనుదినము కాచిటివి
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు
3. పదివేలలో గుర్తించదగిన – సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు – కలిగిన వాడవు
ఉన్నతుడా – మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా – ప్రభాకరుడా – నిను ఆరాధించెదను