Mandiramuloniki Raarandi Song Lyrics
Lyrics in Telugu
మందిరములోనికి రారండి
వందనీయుడేసుని చేరండి “2”
కలవరమైనా కలతలు ఉన్నా “2′
తొలగిపోవును ఆలయాన చేరను
కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను (మందిరము)
1. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది
క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది “2”
వెంటాడే భయములైనా
వీడని అపజయములైనా “2” (తొలగిపోవును)
2. సత్యము భోదించు దేవుని బడి ఇది
ప్రేమను చాటించు మమతల గుడి ఇది “2”
శ్రమల వలన చింతలైనా
శత్రువుతో చిక్కులైనా “2” (తొలగిపోవును)
3. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
స్వస్థత కలిగించు అమృత జలనిధి “2”
కుదుటపడని రోగమైనా
ఎదను తొలిచే వేదనైనా “2” (తొలగిపోవును)
Lyrics in English
Mandiramuloniki Raarandi
Vandaneeyudesuni Cherandi “2”
Kalavaramainaa Kalathalu Unnaa “2′
Tholagipovunu Aalayaana Cheranu
Kalugu Sukhamulu Aa Prabhuni Vedanu (Mandiramu)
1. Devuni Thejassu Niliche Sthalamidi
Kshemamu Kaliginchu Aashraya Puramidi “2”
Ventaade Bhayamulainaa
Veedani Apajayamulainaa “2” (Tholagipovunu)
2. Sathyamu Bodhinchu Devuni Badi Idi
Premanu Chaatinchu Mamathala Gudi Idi “2”
Shramala Valana Chinthalainaa
Shathruvutho Chikkulainaa “2” (Tholagipovunu)
3. Shaanthi Prasaadinchu Deevena Gruhamidi
Swasthatha Kaliginchu Amrutha Jalanidhi “2”
Kudutapadani Rogamainaa
Edanu Tholiche Vedanainaa “2” (Tholagipovunu)