Neethi Nyaayamulu Song Lyrics
Lyrics in Telugu
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్థమైనవి నీ శాసనములు “2”
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజ్య దండముతో (నీతి)
1. ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు “2”
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్గాయువును దయచేయువాడవు “2” (నీతి)
2. పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు “2”
ప్రగతి పథములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు “2” (నీతి)
3. నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు “2”
మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు “2” (నీతి)
Lyrics in English
Neethi Nyaayamulu Jariginchu Naa Yesayyaa
Nithya Jeevardhamainavi Nee Shaasanamulu “2”
Vruddhi Chesithivi Parishuddha Janamugaa
Nee Priyamaina Swaasthyamunu
Raddu Chesithivi Prathivaadi Thanthramulanu
Nee Raajya Dandamutho (Neethi)
1. Prathi vaagdhaanamu Naa Korakenani
Prathi Sthalamandu – Naa Thodai Kaapaaduchunnaavu Neevu “2”
Nithyamaina Krupatho Nanu Balaparachi
Ghanathanu Deerghaayuvunu Dayacheyuvaadavu “2” (Neethi)
2. Parimala Vaasanaga Nenundutaku
Parishuddha Thailamutho – Nannabhishekinchi Yunnaavu Neevu “2”
Pragathi Pathamulo Nanu Nadipinchi
Prakhyaathini Manchi Perunu Kaliginchuvaadavu “2” (Neethi)
3. Nithya Seeyonulo Neetho Niluchutaku
Nithya Nibandhananu – Naatho Sthiraparchuchunnaavu Neevu “2”
Mahima Kaligina Paathraga Undutaku
Pragna Vivekamulatho Nanu Nimpuvaadavu “2” (Neethi)