Nenante Neekenduko E Prema Song Lyrics
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ
నన్ను మరచి పోవెందుకో
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచి పోవెందుకో
కష్టాలలో నష్టాలలో – వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో
నాప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా
1. నిన్ను మర్చిపోయినా నన్ను మరచి పోలేవు నిన్ను విడచి వెళ్ళినా,- నన్ను వీడిపోలేవు
ఎందుకింత ప్రేమ నా పై యేసయ్యా ,,4,,
ఏఋణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలను- నీ ప్రేమను,,
2. ప్రార్ధించకపోయినా-పలకరిస్తూ ఉంటావు
మాటవినకపోయినా-కలవరిస్తూ ఉంటావు
ఎందుకింత జాలి నా పై యేసయ్యా,,
ఏఫలమో-ఈ బంధమూ-నా ప్రేమమూర్తి తాళలేను-నీప్రేమను. ,, నేనంటే నీకెందుకో,,