Nindu manasutho ninne aaradhinchuta nee sankalpam Song Lyrics
నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం
మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం
మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట (2)
1. నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను
దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు (2)
అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య (2) ( నిండు మనసుతో )
2. నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని
నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి (2)
నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య (2) ( నిండు మనసుతో )
3. సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా
వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా (2)
నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య (2) ( నిండు మనసుతో )