PASUVULA PAKALO Song Lyrics
పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి.
ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానూలు, పుజించిరి.
మనసే పులకించేను క్రీస్తు జన్మతో, తనువే తరియించేను రాజు రాకతో
కొనియాడి కీర్తించేదము, పరవశించి ఆరాధించేదం. “2”
1. యుదయ దేశమున, దావీదు పురమందు శ్రీయేసు జనియించే దీనా గర్భమున
పరలోకనాధుండు దరణుద్భవించాడు ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు.
రండి చూడగా వెళ్లేదం, రక్షకుడి భజియించేదం
కనరండి కన్య తనయుని కొలిచేదం
ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం ఆదిసంభుతుని అర్భాటించేదం.
(పశువుల పాకలో)
2. భోళము సాంబ్రాణి బంగారు కానుకలు సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం
అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు బలవంతుడు అయినవాడు ఆ మారాజు
ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం ఆదిసంభుతుని అర్భాటించేదం.
(పశువుల పాకలో)