Randi Utsaahinchi Paadudamu Song Lyrics
Lyrics in Telugu
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే “2”
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము “2”
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము (రండి)
2. మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు “2”
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే (రండి)
3. సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్ “2”
ఆయన దైవము పాలితుల
ఆయన మేపెడి గొర్రెలము (రండి)
4. ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము “2”
ఆయన మాటలు గైకొనిన
అయ్యవి మనకెంతో మేలగును (రండి)
5. తండ్రి కుమార శుద్దాత్మకును
తగు స్తుతి మహిమలు కల్గు గాక “2”
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ
అయినట్లు యుగములనౌను ఆమెన్ (రండి)
Lyrics in English
Randi Utsaahinchi Paadudamu
Rakshana Durgamu Mana Prabhuve “2”
1. Randi Kruthagnatha Sthothramutho
Raaraaju Sannidhikegudamu “2”
Sathprabhu Naamamu Keerthanalan
Santhosha Gaanamu Cheyudamu (Randi)
2. Mana Prabhuve Maha Devundu
Ghana Mahaathyamu Gala Raju “2”
Bhoomyaagaadhapu Loyalunu
Bhoodhara Shikharamulaayanave (Randi)
3. Samudramu Srushtinchenaayanade
Sathyuni Hasthame Bhuvijesen ‘2″
Aayana Daivamu Paalithula
Aayana Mepedi Gorrelamu (Randi)
4. Aa Prabhu Sannidhi Mokarinchi
Aayana Mundara Mrokkudamu “2”
Aayana Maatalu Gaikonina
Ayyavi Manakentho Melagunu (Randi)
5. Thandri Kumaara Shudhdhaathmakunu
Thagu Sthuthi Mahimalu Kalgu Gaaka “2”
Aadini Ippudu Ellappudu
Ainatlu Yugamulanounu Aamen (Randi)