Sadhguna seeluda neeve pujyudavu sthuthi aradhanaku Song Lyrics
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు
సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి (2)
యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే (2)
1. సిలువ సునాదమును నా శ్రమదినమున
మధుర గీతికగా మదిలో వినిపించి (2)
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో (2) (యేసయ్యా )
2. నాతోడు నీడవై మరపురాని
మహోప కార్యములు నాకై చేసి (2)
చీకటి దాచిన -వేకువగా మార్చి
బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే (2) (యేసయ్యా )
3. నా మంచి కాపరివై మమతా సమతలు
మనోహర స్థలములలో నాకనుగ్రహించి (2)
మారా దాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై (2) (యేసయ్యా )