Sajeevudesuni rakthamlo Lyrics
సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా
సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా
అప: యువజనమా – యేసులో బలపడుమా
జడియకుమా – యేసుకై పరుగిడుమా
1. జీవితకాలం స్వల్పం – యవ్వనమెంతో శ్రేష్టం
నీ యవనబలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం
2. ఆకర్షించే లోకం ఆశల నాశనకూపం
లోకాశలను జయుంచుచు సాగిన చేరెదవు పరలోకం
3. దేవుని తోటయే సంఘం – పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం