SEVAKULARA Song Lyrics
సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
1. దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
2. సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
3. సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
I love this song so much
I love this song
Proud to be a jesus son….
I love this song ❤❤❤
I love this song
I love this song
Amen