Yehovaa Naa Balamaa Song Lyrics
Lyrics in Telugu
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం “2” (యెహోవా)
1. నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ “2”
వరదవలె భక్తిహీనులు పొర్లిన “2”
విడువక నను ఎడబాయని దేవా “2” (యెహోవా)
2. మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై “2”
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను “2”
ఆదరెను ధరణి భయకంపముచే “2” (యెహోవా)
3. నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును “2”
జలరాసులనుండి బలమైన చేతితో “2”
వెలుపల చేర్చిన బలమైన దేవుడు “2” (యెహోవా)
4. పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను “2”
తన నోటనుండి వచ్చిన అగ్ని “2”
దహించివేసెను వైరులనెల్లన్ “2” (యెహోవా)
5. మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును “2”
ఉరుముల మెరుపుల మెండుగ జేసి “2”
అపజయమిచ్చును అపవాదికిని “2” (యెహోవా)
6. దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును “2”
గర్విష్టుల యొక్క గర్వమునణుచును “2”
సర్వమునెరిగిన సర్వాధికారి “2” (యెహోవా)
7. నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి “2”
రక్షణ కేడెము నాకందించి “2”
అక్షయముగ తన పక్షము జేర్చిన “2” (యెహోవా)
8. యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే “2”
అన్యజనులలో ధన్యత చూపుచు “2”
హల్లెలూయ స్తుతిగానము చేసెద “2” (యెహోవా)
Lyrics in English
Yehovaa Naa Balamaa
Yadhaarthamainadi Nee Maargam
Paripoornamainadi Nee Maargam “2” (Yehovaa)
1. Naa Shathruvulu Nanu Chuttinanoo
Narakapu Paashamularikattinanoo “2”
Varadavale Bhakthiheenulu Porlina “2”
Vadalaka Nanu Edabaayani Devaa “2” (Yehovaa)
2. Maranaputurulalo Maruvaka Moralida
Unnathadurgamai Rakshanasrungamai “2”
Thana Aalayamulo Naa Mora Vinenu “2”
Adarenu Dharani Bhayakampamuche “2” (Yehovaa)
3. Naa Deepamunu Veliginchuvaadu
Naa Cheekatini Veluguga Cheyunu “2”
Jalaraasulanundi Balamaina Chethitho “2”
Velupala Cherchina Balamaina Devudu “2” (Yehovaa)
4. Pourushamugala Prabhu Kopimpagaa
Parvathamula Punaadulu Vanakenu “2”
Thana Notanundi Vachchina Agni “2”
Dahinchivesenu Vairulanellan “2” (Yehovaa)
5. Meghamulapai Aayana Vachchunu
Meghamulanu Thana Maatuga Jeyunu “2”
Urumula Merupula Menduga Jesi “2”
Apajayamichchunu Apavaadikini “2” (Yehovaa)
6. Dayagala Vaaripai Daya Choopinchunu
Katinulayedala Vikatamu Joopunu “2”
Garvishtula Yokka Garvamunanuchunu “2”
Sarvamu Nerigina Sarvaadhikaari “2” (Yehovaa)
7. Naa Kaallanu Ledi Kaalluga Jeyunu
Eththaina Sthalamulo Shakthitho Nilipi “2”
Rakshana Kedemu Naakandinchi “2”
Akshayamuga Thana Pakshamu Jerchina “2” (Yehovaa)
8. Yehovaa Jeevamugala Devaa
Bahugaa Sthuthulaku Arhuda Neeve “2”
Anyajanulalo Dhanyatha Choopuchu “2”
Hallelooya Sthuthigaanamu Cheseda “2” (Yehovaa)